రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులోకి మంచి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ వెళ్లాలి. అప్పుడే రోజంతా పని చేసే శక్తి వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. డ్రై ఫ్రూట్స్ డిలైట్ అలా శక్తినిస్తుంది. ఉదయం తిని ఇడ్లీ, దోస తో పాటు ఈ డిలైట్ జోడిస్తే ఎంతో శక్తి. ఐదు బాదం పప్పులు రెండు అంజురాలు, ఐదు బ్లాక్ రైజిన్స్, ఐదు గ్రీన్ రైజిన్స్ రెండు ఎండు ఖర్జూరాలు, ఐదు మిరియాలు శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నాననివ్వాలి. బాదం పప్పుల పైతోలు తీసి ఖర్జూరాలు గింజలు తీసేసి మిగతా అన్నింటిని కలిపేస్తే రుచిగా శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్ డిలైట్ తయారైపోతుంది. ఆఫీస్ కు వెళ్లే ఉద్యోగినులు తప్పనిసరిగా తినాలి అంటారు ఎక్సపర్ట్స్.

Leave a comment