క్యాబేజీ, కాలీ ఫ్లవర్ ,బ్రకోలి కుటుంబానికి చెందిన ముల్లంగిలో తక్కువ క్యాలరీలు నాణ్యమైన పీచు దుంపల కనబడే ముల్లంగి ప్రత్యేకత. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఉడికించకుండా సలాడ్ రూపంలో తీసుకుంటే విటమిన్ సీ అత్యధికంగా పొందవచ్చు. శరీర కణాల పైన ఒత్తిడి తగ్గించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో అధికం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మధుమేహం రానివ్వకుండా కాపాడుతుంది ముల్లంగి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ లు రానివ్వదు. వేపుడు, పచ్చడి, సాంబార్‌ ,సలాడ్ లో ముల్లంగిని వాడతారు.

Leave a comment