జీవితంలో ఏం చేసినా సినిమాలు మాత్రం మానను ,నేను పుట్టిందే సినిమాల  కోసం అంటోంది అమలా పాల్.  ఇప్పుడామె నటిస్తున్నా తమిళ చిత్రం కోసం ఫైటింగ్స్ లో డూప్ లేకుండా నటిస్తుంది అమలాపాల్. సినిమా పరంగా హీరోయిన్ ఫైటింగ్ చేయాలి. స్టంట్ సీన్స్ లో డూప్ లని పెడతారు.నాకు అది ఇష్టం లేదు. ఆ సన్నివేశాలకు  అవసరమైన స్టంట్స్ నేర్చుకొన్నాను. ఇందుకోసం నా శరీరాన్ని బాగానే కష్ట పెట్టుకొన్నాను. హీరోలే ఫైట్స్ చేయాలి , హీరోయిన్స్ డాన్స్ లు చేయాలనే అభిప్రాయం ఈ సినిమా చూస్తే పోతుంది అంటోంది అమలా పాల్.  నా ఇంకో సినిమా ఆడై కూర పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఏ హీరోయిన్ కూడా అంత తెలిగ్గా ఒప్పుకోని పాత్ర చేశాను. ఎంతో ఆలోచించి చివరకు ఆ సినిమాలో నటించాలనే నిర్ణయం తీసుకొన్నాను అంటోంది అమలాపాల్.

Leave a comment