పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు బ్రహ్మ తపస్సు చేసి తన శరీరంలోని రక్తం ఎక్కడ పడినా అతని సైన్యం పుట్టుకొని వస్తారని వరం పొందాడు.రక్తబీజుడు జనులను బాధించటం చూసి పార్వతీ దేవి దుర్గా దేవిగా అవతారం ఉద్భవించి రక్తబీజునితో యుద్ధం చేయసాగింది.పలు రకాల ఆయుధాలను ఉపయోగించిన వాడి శరీరం నుంచి పడిన రక్తపు బొట్టుతో సైన్యం రెట్టింపు అవుతున్న సమయంలో దుర్గాదేవి నిస్సహాయురాలైనది.
దేవతలు శివుని దర్శనం చేసుకుని వారిని రక్షించమని అర్ధించగా  దుర్గా దేవి అప్పటికే రక్తబీజుని శరీరంలోని రక్తాన్ని తాగేసి కరాళ నృత్యం చేస్తూ వుంటే శివుడు తనని పిలిచినా కూడా పలికే స్థితిలో లేదు.అట్టి సమయంలో మైకంలో చేస్తున్న నృత్యం చూసి శివుడు దుర్గా  దేవి పాదాల క్రిందకి వచ్చిన అప్పుడు అమ్మవారు తన భర్త అని గ్రహించి అవతారం చాలించినది.

నిత్య ప్రసాదం:కొబ్బరి,నిమ్మకాయలు

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment