హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య  విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా  అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల బరువుకు కిందపడిపోయిందట. ఇలాంటి అనుభవాలు ఎంతో మంది హీరోయిన్స్ కి కూడా ఉన్నాయి. దీపికా పడుకునే రామ్ లీలా లో 130 కిలోల బరువున్న గాగ్రా బాజీరావ్ మస్తానీ లో 20 కిలోల బరువున్న కాస్ట్యూమ్స్ వేసుకుంది. ఐశ్వర్య రాయ్ జోధా అక్బర్ లో 30 కిలోల దేవదాస్ లో మాధురీ దీక్షిత్ 30 కిలోలున్న దుస్తులు వేసుకుని తంటాలుపడితే అనుష్కా శర్మ శ్రీదేవి లు  కూడా బరువైన నగలు దుస్తులు వేసుకుని ఆపసోపాలు పడ్డవారే.తెరపైన కేవలం అందం అభినయంతో ఆకట్టుకోవడం కాదు. ఇంతింత బరువైన దుస్తులు వేసుకోవటం ఛాలెంజ్ అంటారు వీళ్లంతా !!

Leave a comment