తెలుపు రంగు దుస్తులు పైన మరకలు పడితే ఉతకటం కష్టం.చిన్న చిట్కాతో కొత్తదనం పోకుండా మరక వదలగొట్ట వచ్చు.తెల్లని దుస్తులు ఉతికేప్పుడు ఇతర వర్గాల దుస్తులు వాటితో కలవద్దు.ఇతర దుస్తుల వర్గాలు అంటి తెలుపు దుస్తులు రంగు మారతాయి.క్లోరిన్ బ్లీచ్ తెలుపు రంగు దుస్తులు మెరుపు కోల్పోనివ్వకుండ కాపాడుతోంది.అయితే దాన్ని కొద్దిగానే వాడాలి.ఉతికే నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపితే దుస్తుల రంగు మారవు పొరపాటున మరక పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేడినీళ్లు వాడవద్దు.అలా చేస్తే రంగు మరింత గట్టిగా అంటుకుంటుంది.మార్కెట్ లో వైట్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి.వీటితో మరక పోగొట్టవచ్చు.అలాగే మరక పడ్డ వెంటనే శుభ్రం చేయాలి.

Leave a comment