ఎమ్మెల్యే కొడుకుని ఫ్రెండ్స్ తో కార్ లో తిరుగుతున్న అందుకు డ్యూటీ లో ఉన్నవారచ్చ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సునీతను డ్యూటీ నుంచి తప్పించారు పోలీస్ అధికారులు.వారచ్చ మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ కనాని కొడుకుని కర్ఫ్యూ సమయంలో బయటికి వచ్చినందుకు నిలదీసిన సునీత ను,నువ్వు నిలబడిన చోట 365 రోజులు నిలబెడతాను అని బెదిరించాడు.అతన్ని కారు నుంచి దించి నిలబెట్టింది సునీత.ఈ వీడియోలు సునీత హెచ్చరిస్తున్న గొంతు, ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు వైరల్ అయ్యాయి.ప్రపంచం మొత్తం ఈ వీడియో చూసింది కానీ తన డ్యూటీ తాను చేసిన సునీత సస్పెండ్ అయ్యింది.బాలీవుడ్ నటులు ఆమె  బ్రేవరీని ప్రశంసించారు.కానీ ఆమె ఉద్యోగం నుంచి రిజైన్ చేసే పరిస్థితి కల్పించారు అధికారులు.తన డ్యూటీ తను చేయనీయనందుకు జాబ్ వదిలేసింది సునీత.

Leave a comment