ప్రతి రోజు నిద్రపోయే ముందర చక్కని బ్రెష్ తో జుట్టుకు వంద స్ట్రోక్స్ ఇస్తే సహాజ నూనెల ఉత్పత్తి జరిగి జుట్టుకు పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . హెయిర్ మాస్క్,ఆయిల్ డీప్ కండిషనర్ గా పని చేస్తాయి. జుట్టుకు పోషకాలు ఇస్తాయి.జుట్టు కుదుళ్ళ నుంచి చివరి దాకా పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు ఆయిలింగ్ చేయటం పెద్ద ఖరీదు కానేకాదు. కొబ్బరి నూనె ,బాధం నూనెతో మసాజ్ చేసుకొంటే మాడులో రక్తసరఫరా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే నూనె రాసి అలాగే వదిలేయకూడదు చుండు వచ్చే అవకాశం ఉంటుంది.

Leave a comment