జుట్టు ను బట్టి చక్కని దువ్వెన ఎంచుకొండి.చిక్కులు లేకుండా స్టైలింగ్ చేసుకోవాలన్న ఆ దువ్వెన చక్కగా పనికి వస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. వెంట్రుకల తత్వాన్ని బట్టి దువ్వెనలుండాలి.అది నాణ్యమైనదిగా సున్నితమైనదిగా ఉండాలి.జుట్టు పొడవుగా చిక్కులు పడకుండా ఉంటే పాడెల్ బ్రష్ వాడుకోవచ్చు.ఈ దువ్వెనకు పళ్ళు విశాలంగా ఉంటాయి.పైగా పై నుంచి కిందకు నెమ్మదిగా దువ్వితే మాడుకు మర్ధనా జరుగుతుంది. జుట్టుని పార్టిషన్ గా తెగిపోకుండా విడగొట్టటానికి రా టైల్ రకం దువ్వెన కావాలి. జుట్టు పొట్టిగా రింగులు తిరిగి వత్తుగా కనిపించాలి అంటే టీజింగ్ బ్రష్ వాడాలి.

Leave a comment