ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే సెల్ఫీ అస్పస్టంగా వుంటుంది. ఇలాంటి ఫోటోలకు అలంకారణ అక్కర లేదు. వీలైనంత సహజంగా వుండాలి. ముఖంలో రకరకాల భావాలు చుపెట్టాలంటే మాత్రం సెల్ఫీ అసహజంగా వుంటుంది. ముఖాన్ని కాస్త పక్కకు పెట్టాలి. సన్నగా కనబడాలంటే ఫోన్ దూరంగా వుంచి తీసుకోవాలి. లేదా ఇంటి దగ్గరే ఒక ఫోటో సెషన్ ప్లాన్ చేయాలి. అప్పుడే ఏ యాంగిల్ మోహ బావుంటుందో తెలిసిపోతుంది. ఒక్కరి కంటే ఎక్కువ మంది వుంటే కాస్త పొడుగ్గా వున్న వాళ్ళకి ఫోన్ ఇస్తే బాగా వస్తుంది. ఇక ఎత్తయిన ప్రదేశాలు, జలపాతాలు, సముద్రాలూ, నడి రోడ్లో సెల్ఫీ కోసం ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.

Leave a comment