వజ్రాలు,కెంపులు,పచ్చలు నీలాల లాగే నేల పొరల్లో ఒనిక్స్ జేడ్ వంటి సహజాతి రత్నాలు ఉన్నాయి. ఇవి చాలావరకు సిలికేట్ ఖనిజాలు. నలుపు నుంచి తెలుపు వరకు అన్ని రంగాల్లో ఒనిక్స్ రాళ్లు దొరుకుతాయి. వీటిని పూసలు గా మర్చి ఆభరణాలు చేస్తున్నారు. చిన్న పెద్ద సైజుల్లో క్రిస్టల్స్ లేదా పూసల లాగా చెక్కి వాటిని రెండు మూడు వరుసల్లో గుచ్చి వాటికి కుందన్ మీనాకారి టెంపుల్ డిజైన్  లలో బంగారు లాకెట్ లను అమర్చి హారాలుగా నెక్లెస్ లుగా డిజైన్ చేస్తున్నారు. ఆకుపచ్చ రంగు లో ఉన్న ఒనిక్స్ బీడ్స్ చూసేందుకు ఆడంబరంగా అందంగా కనిపిస్తుంది. సహజంగా దొరికే ఒనిక్స్ రాళ్ళలో కి కృత్రిమ రంగులు జోడించి జొప్పించి, ఇంకొన్ని రంగులు సృష్టిస్తున్నారు.ఈ రాళ్ల పూసల జ్యువలరీ ఎంతో అందంగా ఉంది.

Leave a comment