చేస్తున్న ప్రతి సినిమా విజయాన్నే రుచి చూపిస్తోంది . మరి నటిగా ఎప్పుడైనా అభద్రతకు లోనయ్యారా ?ఎప్పుడు ఇంత దైర్యం గానే ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమంత అలా ఎప్పుడూ ఫీలవ లేదు అంటోంది . ఈ ఫీల్డ్ లో గట్టిపోటీ ఉంటుంది . మహిళా ప్రధానమైన కథలు ఇప్పుడే వస్తున్నాయి . నా తోటి నాయికలు బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు . వాళ్ళను చూస్తుంటే నాకు స్ఫూర్తిగా అనిపిస్తారే తప్ప అ భద్రత ఎప్పుడూ లేదు . తొలినాళ్ళలో ,నాకు ఈ పరిశ్రమ కొత్తదే ,అవకాశాలకు తగ్గట్టు నన్ను నేను సర్దుబాటు చేసుకోవటమే సరిపోయింది . తర్వాత మాత్రం సమంత ఇవే చేయగలను ,ఇలాగె చేస్తుంది అన్న ముద్రలు చెరిపేయాలని గట్టిగ అనుకొన్నా . ఎలాటి సవాళ్ళయినా ఎదుర్కొనే పాత్రలు చేయాలనీ నిర్చయించు కొన్నా దాన్ని ఆచరణలో పెట్టాను అంటోంది సమంత .

Leave a comment