ప్రతి రోజు ఒక వింత కబురు . ఒక కొత్త ఎక్సెపెరిమెంట్ నాలుకకు ఓ కొత్త రుచి. ఇదే మార్కెట్ ట్రెండ్. వినియోగదారుడు మోజుపడి ఒక వస్తువు కొనుక్కుని రుచి చూసి దానికి శాస్వతంగా ఒక కమిట్ మెంట్ ఇద్దామనుకునే లోపే ఇంకో వస్తువు క్యూలో ఉంటుంది. ఆ కొత్తదనపు తీరాల వెంట మనిషి పరుగో పరుగు. ఇప్పుడు పూట్టగోడుగుల్లో ఖనిజాలు, కాఫర్ ,నియాసిన్ పోటాషియం , ఫాస్పరస్. విటమిన్ సీ, ఐరన్ ఎన్నో పోషకాలున్నాయని తెలిసిపోయింది కదా. వాటిలో రకరకాల వంటలు వండేసుకుంటున్నారు. ఈ రుచుల పరిశ్రమలోకి పుట్టగొడుగుల కాఫీ,టీ ఉత్పత్తి మొదలైపోయింది. వరుసగా రకరకాల డ్రింక్స్ , టీ, కాఫీలు వచ్చేస్తున్నాయి. భవిష్యత్ లో పుట్టగొడుగుల కాఫీలకు సిద్దమైపోవాలి.

Leave a comment