స్కర్ట్ మోడ్రన్ శైలిగానే ఉందక్కర లేదు. లేహంగా, పరికిణీల్లాగా కాకుండా డిజైన్ ను బట్టి రూపం మర్చుకునేదే స్కర్టు. ఇప్పుడు చాలా సినిమాల్లో ఎనిమేట్రిక్ డిజైన్ స్కర్టులు చూస్తుంటాం. ముందు వైపు మోకాళ్ళ వరకు వుండి , వెనక వైపు నెలకు తగిలేలా వుంటుంది. పొరలు పొరలుగా డిజైన్ చేస్తారు దీన్ని. ఇది ఒకే రకమైన వస్త్రంతో కుట్టిన్చుకోనక్కర లేదు. ముందు వైపు చక్కని కాటన్, వెనక వైపు కలంకారీ కాటన్ ప్రయత్నించ వచ్చు. లేస్, నెట్ ల తో పొరలు పొరలుగా కుట్టే ఈ ఫ్యాషన్ గౌన్ చాలా బావుంటుంది. అలాగే లఎర్స్ తరహా డిజైన్స్ కూడా స్కర్ట్ గా బావుంటుంది. పొరలు పొరలుగా కుట్టే ఈ స్కర్ట్ లో ఎక్కువ రంగులు ఉపయోగించలన్నా లేదా అవేరంగుల్లో ఇతర ఛాయలు ప్రయత్నించినా ఆధునికంగా, అందంగా కనిపిస్తుంది. అలాగే అంబ్రిల్లా స్కర్ట్ కూడా ప్యూర్ సిల్క్, సిల్క్ నెట్, జార్జేట్, షిఫాన్ వంటివి ఎక్కువ ఉపయోగించి కుడతారు. స్కర్ట్ అంచులకు పీకొ చేస్తే వెడల్పుగా పరుచుకున్నట్లు కనబడేలా అన్ని సందర్భాలకు నప్పేలా చేస్తుంది.

Leave a comment