1966 లో ఇదో ఏడాది మెడిసిన్ చదువుతున్న రీటా ఫారియా మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెలుచుకున్నది. స్విమ్సూట్ అద్దెకు తీసుకున్న చీర అరువు నగలతో విమానం ఎక్కేసి లండన్ వెళ్ళింది రీటా. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నారు.ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె డాక్టర్ గానే తన కెరీర్ కొనసాగించారు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లో చదువు పూర్తి చేశారు. డబ్లిన్ లో వైద్యురాలిగా ప్రొఫెసర్ గా కొనసాగారు రీటా ఫారియా.