ఇక రాబోయే ఎండలకు కాస్త వదులుగా వంటికి సౌకర్యంగా ఉండే డ్రెస్ లు ఎంచుకోవాలి. పలచగా ,మెత్తగా జారీ జారీ పోయే జార్జెట్ తో కుట్టిన కాఫ్తాన్ లు పార్టీ వేర్ గా బావుంటాయి. నడుము దగ్గర ఫ్యాన్సీ బెల్ట్ వేసుకోని ఈ వెనింగ్ గౌన్ గా ఈ కాఫ్తాన్లు అందంగా ఉంటాయి. ఇక ఫార్ట్ టాప్ కాఫ్తాన్లు జీన్స్ తో కలిపి వేసుకోవచ్చు. మోకాళ్ళ కింద వరకు ఉండే కాఫ్తాన్స్ లెగ్గింగ్లతో ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. కాస్త పెద్దవిగా అనిపించినా వేసుకొంటే నాజుగ్గా ఉండే కాఫ్తాన్ కాటన్ షిఫాన్ అన్ని రకాల వస్త్రశ్రేణి లలోనూ బావుంటాయి. వీటిలో అన్ని వెరైటీలు ఫ్రాక్ లు, షార్ట్ టాప్ లు, లాంగ్ టాప్ లు వచ్చాయి.

Leave a comment