ఈ సంవత్సరం కలర్ ఆఫ్‌ ది ఇయర్ ఆల్ట్రా వయెలెట్ రంగు నిలిచింది. ఉదా రంగులో ఇదొక వర్ణం. వేలాది డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్స్ కార్పొరేట్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేసుకున్న పాంటోన్ కలర్‌ ఇనిస్ట్యూట్ ప్రతి సంవత్సరం ఒక రంగును ప్రకటిస్తుంది. ఈ సంవత్సరపు ఉదా రంగు ఎన్నో బావోద్వేగాలకు రూపం. ఇప్పటికే రాంప్ వాక్స్ కోసం డిజైనర్లు ఈ రంగు దుస్తులకు ప్రాణం పోశారు. ఆహారంలో కల ఉదా బిస్కెట్లు, జ్యూస్ లు ముబైల్ కంపెనీలు ఉదా రంగు స్క్రీన్ సేవర్లను సృష్టించారు. ఎక్కువగా నగల్ల్లో వాడే పచ్చ, కెంపులకు తాజా ఈ వర్ణం నగల్లో మెరుస్తుంది. బ్యాగ్ లు, క్లిప్పులు, చెప్పులు ఉదా రంగులో ఫ్యాషన్ ఐకాన్స్ గా మెరుస్తున్నాయి. వార్డ్ రోబ్ లో ఈ రంగు కోసం వెతకాలి మరి.

Leave a comment