జంక్ ఫుడ్ తింటున్న కొద్ది తినాలనే ఉంటుంది.కొంచెం కష్టపడి అయినా తినే సందర్భాలను తగ్గించుకుంటే క్రేవింగ్ తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యకరమైన ఆహారం పెంచుకుంటూ జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. ముందుగా జంక్ ఫుడ్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి. రకరకాల రుచులతో పోషకాహారం తయారు చేసుకోవటం ద్వారా మెదడు కోరుకునే రుచిని అందించి  నెమ్మదిగా జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి ఆకలి వేస్తే దాకా ఆగకుండా సమయానికి తినేయాలి అప్పుడే జంక్ ఫుడ్ వైపు చేతులు వెళ్ళావు.ఒత్తిడిలో ఉంటే ఏదో ఒకటి తినాలని ఉంటుంది వ్యాయామం యోగా ద్వారా ఒత్తిడి తగ్గించుకుని జంక్ ఫుడ్ మానేయాలి.జంక్ ఫుడ్ తీసుకుంటే వచ్చే కష్టాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ కరోనా సమయంలో పుష్టినిచ్చే రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఆహారం వైపు మొగ్గు మంటున్నారు ఎక్స్పర్ట్స్.

Leave a comment