కొత్త సంవత్సరం రాబోతుంది దగ్గర వాళ్ళకు స్నేహితులకు ఏదైనా అపురూపమైన కానుకలు ఇవ్వాలనిపిస్తుంది.అవి బీరువాలో దాచుకొనేవి కాకుండా నిత్యం వాడుకోగలిగే వస్తువులైతే బావుంటాయి. శరీరానికి స్వాంతన ఇచ్చేది స్నానం. ఈ స్నానానికి పనికి వచ్చే బాత్ సాల్ట్స్ బహుమతిగా నీళ్ళలో ఈ సాల్ట్స్ కన్నా సుగంధద్రవ్యాలు కలుపుకొంటే శరీరంలోని నాడులు విశ్రాంతిని పొందుతాయి. అలాగే చక్కని సువాసనలు ఇచ్చే క్యాండిల్స్ పూలపరిమళాలు వెదజలేవిస్తే వాటితో ఇల్లంతా సుగంధ భరితం అయిపోతుంది. అలాగే గిఫ్ట్ గా వస్తువు ఇచ్చిన ధాన్ని వాడుకోగలిగేలా ఉండేలా చూస్తేనే ఉపయోగం ముఖ్యంగా పుస్తకాలు బహుమతిగా ఇస్తేనే మరింత బావుంటుంది. పిల్లల కోసం కూడా బాలసాహిత్యం అందుబాటులోనే ఉంది.

Leave a comment