కెనడాకు చెందిన 75 సంవత్సరాల జాన్ మెక్ డోనాల్డ్ సోషల్ మీడియా సెలబ్రెటీ . ట్రైన్ విత్ జాన్ అనే ఇన్ స్ట్రా గ్రామ్ పేజీని మొదలు పెట్టి అయిదు లక్షల మంది వ్యక్తులతో నిరంతరం వార్తల్లో ఉంటుందామె . అధిక బరువు ,బి పి ,కొలెస్ట్రాల్ తో ఎన్నో ఇబ్బందులు పడిన జాన్ తన సమస్యల పరిష్కారం కోసం జిమ్ లో చేరింది . ఎన్నో గంటలు కష్టపడి బరువు సగానికి సగం తగ్గించుకొని మంచి బాడీ బిల్డర్ గా తయారయ్యారు . ఆమె బరువు తగ్గించుకొని చక్కని శరీర సౌష్టవం తో కనిపించటం ఎంతో మందికి ఇన్ స్పిరేషన్ అయిపోయింది . ఏ పనికైనా వయసు అడ్డంకి కాదని నిరూపించింది  జాన్ మెక్ డోనాల్డ్.

Leave a comment