ప్రస్తుత జీవన శైలి ,ఆలోచనలు ,దినచర్య లే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని సిమోన్ బోలివర్ యూనివర్సీటికి చెందిన మిరాఠ మాంటెల్లా అనే పరిశోధకరాలు చెపుతున్నారు . 18 నుంచి ,20 ఏళ్ళ లోపున్న వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఈ అధ్యయనం చేశారు . ఆ విద్యార్థుల్లో 43 శాతం మంది లావుగా ఉన్నారు . 26 శాతం మంది ఊబ కాయులు . వీళ్ళు రోజూ నాలుగైదు గంటల పాటు కదలకుండా ఫోన్ లు చూసేవాళ్ళుగా గుర్తించారు . ఆకలి లేకపోయినా తోచక తీపి పదార్దాలు, శీతల పానీయాలు ,ప్రోసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ,పైగా ఏం తింటున్నారో కూడా ఎంత తింటున్నారో గమనించక పోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నం అయిందంటున్నారు . ఇదే జీవన శైలి తో కొనసాగితే మాత్రం భవిష్యత్ లో మధుమేహం ,కాన్సర్లు ,గుండె జబ్బుల బారిన పడతారంటున్నారు

Leave a comment