Categories
అవకాడోని ఎంతో పోషకభరితమైన పండు అంటారు. వీటిలో ఉండే అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్ ఇతర పండ్లలో ఉండవు. బరువు తగ్గిపోవాలనుకుంటే అవకాడో జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి,ఇ పుష్కలంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను గట్టిగా ఉంచుతాయి. పోటాషియం రక్తపోటు స్థాయిల్నీ అదుపులో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం . అవకాడోని పండక ముందు ఫ్రిజ్ లో ఉంచ కూడదు. బాగా పండాక ఫ్రిజ్ లో పెడితే వారం వరకు నిల్వ ఉంటాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ ,ఫ్లేవర్స్ కలువవు కనుక ఎంతో ఆరోగ్యం కూడా.