ముఖం పై నల్ల మచ్చలు,వలయాలు పోయేందుకు ఖరీదైన క్రీములు ఫేష్ వాష్ లు వాడుతూ ఉంటారు.కాని వీటన్నింటికంటే సింపుల్ పరిష్కారం బత్తాయిపండులో దాక్కుని ఉంది.ముఖం శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రంగా ముఖం పై కదలిస్తూ ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ సహజమైన తేలికపాటి బ్లీచ్ గా క్లెన్సింగ్ పని చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బ్లాక్ హెడ్స్ పోగొడుతుంది.మోకాళ్ళ పై బత్తాయి చెక్క రుద్దుకోవచ్చు,బత్తాయి తొక్కలు ఎండబెట్టి గ్రైండ్ చేసి ఆ పొడిలో తేనె కలిపి మంచి ప్యాక్ గా వేసుకోవచ్చు. బత్తాయి రసం రోజుకి రెండు మూడుసార్లు పెదవులపై రాస్తే పెదవులపై నలుపు పగుళ్ళు పోతాయి.

Leave a comment