అచ్చంగా అరుంధతి సినిమా కథ అక్కడ జరిగినట్లు ఉంటుంది ఆ కోటను చూస్తూ ఆ చరిత్ర వింటూవుంటే. రాజస్థాన్ లోని భాన్ గార్ కోట బయట ఒక ఉత్తర్వు కనిపిస్తుంది సూర్యోదయం ముందుగానీ సూర్యాస్తమయం తర్వాత గానీ ఈ కోటలోకి అడుగుపెట్టటం నిషేధం అని కనిపిస్తూ వుంటుంది ఈ ఉత్తర్వు ఉల్లఘించి కోటాలో వేళ గాని వేళ అడుగు పెట్టారా మాయమై పోతారని స్థానికులు నమ్మకంగా చెపుతారు రత్నావతి అనే రాజకుమారికి సింఘియా అన్న తాంత్రికుడికీ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారు అక్కడే ఆత్మలై తిరుగుతారని నమ్మకం. బాలక్ నాధ్ అనే సాధువు శాపంతో ఈ కోట దెయ్యాల నిలయంగా మారిందని మరో కథ. ఈ రెండు నిజమా కదా అని తేల్చేందుకు ఈ కోట లోపలికి వెళ్ళి ఎవ్వళ్ళూ తేల్చుకొనేలేదు. పగటి పూట టూరిస్ట్ లు వెళతానే ఉంటారు.

Leave a comment