ఇంట్లో పనితోనే మన వ్యాయామం సరిపోతుంది. అనుకోని వాళ్ళ కోసం ఒక అడుగుల లెక్క వచ్చింది. కనీసం రోజుకు 10వేల అడుగులు వేస్తే పూర్తి వ్యాయామం చేసినట్లు లెక్క. నడక పూర్తి చేసినట్లుయితే రోజుకు కనీసం 5వేల అడుగులు వేసే పని ఉంటుందని అంచనా. ఇల్లు చిమ్మి తుడవడం కనుక చేస్తే దాదాపు వెయ్యి నుంచి 12 వందల అడుగులు ఇంట్లో అటు ఇటు తిరిగేందుకు 800 అడుగులు నుంచి వెయ్యి అడుగులు పడతాయి. ఇక తలో పని చేస్తే 2 వేల అడుగులు వేయవచ్చు.కారు కడిగేందుకు తుడిచేందుకు వెయ్యి నుంచి 15 వందల అడుగులు వేయవలసి వస్తుంది. ఇలా గనుక పనిచేయగలిగితే దాదాపు శరీరానికి కావల్సిన వ్యయామం సగం ఇంట్లోనే అయిపోతుంది.

Leave a comment