పిల్లలు పోతపాలు తాగిన తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ లెవల్స్ లో ఎలాంటి తేడా ఉండదని ఒక అధ్యయనంలో చెబుతోంది.గతంలో కొన్ని అధ్యయనాలు తల్లిపాల వల్లే పిల్లలు ఎక్కువ తెలివితేటలతో ఉంటారని చెప్పాయి.కానీ ఈ కొత్త అధ్యయనం మాత్రం పిల్లలు ఎదుగుదలలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం తల్లిదండ్రులకు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని పోత పాలు పట్టే తల్లులు తమ పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయలేదని గ్రహించమంటున్నారు.జీన్స్ పరంగా పిల్లలు అవగాహన శక్తితో హెచ్చుతగ్గులు  ఉండవచ్చేమో కానీ తల్లిపాలతో పిల్లల్లో ఐక్యూ శాతం పెంచే శక్తి లేదంటున్నారు.కాకపోతే సమస్య తల్లిపాలు తాగిన పిల్లలలో ఇతర అనారోగ్య సమస్యలు కనిపించవు అంటున్నారు.

Leave a comment