Categories
అలాంగియం సాల్విఫోలియం పేరుగల అంకోలా లేదా ఉడగ చెట్టు అనారోగ్య ఔషధం.ఈ మొక్క ఆకులు వెండి నానో కణాల తయారీ ప్రక్రియ లో వాడతారు భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్క కు లేత పసుపు రంగు అందమైన, అతి సువాసన గల పూలు పూస్తాయి. ఈ మొక్కకు కాసే చిన్న పండ్లు ఎండాకాలంలో మూడు నాలుగు గంటలు దాహం వెయ్యదు. ఈ పండ్ల జీవ సంబంధ సమ్మేళనాలలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయని అధ్యయనకారులు చెబుతున్నారు. పది పన్నెండు మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్టు పెరటి చెట్టుగా పెంచుకోవచ్చు.
