స్పిరులినా నాచు మొక్క పైన ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని సూపర్ ఫుడ్ గా చెపుతారు. ఇప్పుడు ఈ స్పిరులినా బీపీ ని తగ్గిస్తుందని చెపుతున్నారు. పరిశోధకులో స్పిరులినా తిన్నవారి రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సాఫిగా జరుగుతున్నట్లు గుర్తించారు. స్పిరులినా నుంచి సేకరించిన పెస్టైడ్ ను ఇంజక్ట్ చేయటం ద్వారా రక్త నాళాల గొడల్లో నైట్రిక్ ఆక్సైడ్ విడుదల కావటంతో అవి వ్యాకోచించటాన్ని గుర్తించారు. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకొంటే బిపి తగ్గిపోయే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.

Leave a comment