ప్రత్యేక సందర్భాలలో అమ్మాయిలు మెడ నిండా నగలు సంప్రదాయ దుస్తులు కోరుకుంటారు. అన్ని సార్లు బంగారు నగలు సాధ్యం కాదు. వెండి పైన బంగారు పూత పూసిన మైక్రో గోల్డ్ ప్లే బేస్, వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ రకాల నగలు వచ్చాయి. కుందన్ లో బీట్స్ లో నవ రత్నలలా కనిపిచే నగలు ఉన్నాయి. గుత్తి,పూసలు,హారాలు ,మామిడి పిందెలు హారాలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు బంగారు నగలు లాగే కనపడతాయి. ముత్యాలు,కుందన్ లు తో తాయారు చేసిన కుందన్ డిజైన్ నగలు టెంపుల్ జ్యుయలరి కూడా ఒన్ గ్రామ్ గోల్డ్ లో కోనుక్కోవచ్చు . నెలవంకలు,వడ్డాణాలు,జడ బిల్లలు ,పట్టిలతో సహా వన్ గ్రామ్ గోల్డ్ చాలు అమ్మాయిలు బంగారు బోమ్మలా చుపేందుకు.

Leave a comment