నీహారికా ,

శనిదశలో  శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్  విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి కానీ పనులకు తామే ఖర్మమటందుకు విశ్వదాభిరామ వినురవేమ. ఎలావుందీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బల్లి పలికితే ఏమవుతుంది అంటారు. ఒకవేళ పనికాకపోతే ఖర్మ అంటారు. ఇలా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం. మనం ఒక పని మొదలుపెట్టి సఫలం కాకపోతే అదెక్కడ ఎలా జరిగిందో ఎనాలిసిన్ చేసి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని దిద్దుకుని మళ్ళీ పని మొదలు పెడతాం. ఆ ప్రయత్నంలో పదిసార్లు విఫలమైనా 11 వ సారయినా  సక్సెస్ అవుతాం. ఇది శనిదస అనుకున్నామనుకో అసలు ప్రయత్నం మానేస్తాం . ఇక దశ తిరిగి రోజు కోసం ఎదురుచూస్తాం. అంటే ఇకెప్పటికీ పరాజయమే నన్నమాట. ఎవరో ముక్కు వంకరగా ఉందని అద్దాన్ని నిందించాడంటాడు ఇంకో పర్వంలో వేమన. అంచేత ఈ దశలు మహాదశలు పక్కనపెట్టి పనిచేయటం నేర్చుకో ఏమంటావు !!

 

Leave a comment