చర్మం యవ్వన కాంతితో ఉండాలంటే శరీరానికి నూనె పట్టించి మసాజ్ చేయడం ఒక్కటే దారి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాదం నూనెలో ఎక్కువగా వుండే విటమిన్ ఇ చర్మాని ఆరోగ్యాంగా వుంచగలుగుతుంది. కొబ్బరి నూనె లో మేలుచేసే సాచురేటెడ్ స్క్రబ్ యాంటి బాక్టిరియల్ గుణాలు ఉంటాయి ఆలివ్ నూనెలో ఉండే యాంటి యాక్సిడెంట్ లో విటమిన్ ఎ,డి,ఈ ఎండ కారణంగా నల్ల బడిన చర్మాన్ని పూర్వపు రంగులో తెస్తాయి పొద్దు తిరుగుడు నూనెలో ఉండే విటమిన్ ఈ ఒమేగా-6 ఆసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కొత్త చర్మ కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇది ఆముదం లోని మాంసకృతులు జుట్టుకి చర్మానికి మేలుచేస్తాయి. ఈ నూనె లో ఏదో ఒక దానితో శరీరానికి మసాజ్ చేసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

Leave a comment