Categories
వయసుతో సంబంధం లేకుండా అందరూ బుట్ట లోలాకులు పెట్టు కొంటున్నారు అందరు . ఈ అభిరుచి గమనించి వందల వేల డిజైన్ల బుట్టలు తయారుచేస్తున్నారు నగల డిజైనర్లు . టెంపుల్ నగిషీ ,స్టోన్ పాచీ ,పోల్కి ఫిలిగ్రీ ,తవా తుషి అన్ని రకాల డిజైన్ లలోను బుట్టలు వస్తున్నాయి . అలాగే పంజరం ,త్రికోణం,కోలా కారం,కోణాకారం చతురస్త్రం ,దీర్ఘ చతురస్త్రం ఆకారాల్లోనూ ,అందమైన గిల్డ్ ,వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ ,జర్మన్ సిల్వర్ ,ఆక్సిడైజ్ డ్ సిల్వర్ ,మెటల్స్ తో ఎన్నో డిజైన్ లలో అందమైన రాళ్ళూ ,వజ్రాలు ముత్యాలు ,బుట్టలో చక్కగా వదిగిపోయి కనిపిస్తున్నాయి . చక్కని పట్టుచీరెకు తోడు చెవులకు బుట్టలోలాకులు ఉంటే చాలు లక్షణంగా వంటినిండా నగలుంటే పండగ లుక్ వచ్చేసినట్లే