ఉదయం లేస్తూనే ఒక కప్పు కాఫీలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. నిద్రమత్తు పొతూ చురుకుదనం వస్తుంది. నిజమే కానీ ఇది నిమిషాల్లో జరిగే చర్య . రోజంతా ఉత్సాహం కోసం మాత్రం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనాలున్నాయని నిపుణుల సలహా. ఇలా తాగితే గ్యాస్ట్రిక్ ప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరం విటమిన్లు,ఖనిజాలు బాగా గ్రహిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టివ్ అనే ఒక ప్రత్యేక పీచు పదార్ధం వల్ల శరీరం బరువు తగ్గుతుంది.

Leave a comment