ఆమెకు 102 సంవత్సరాలు. పేరు మన్ కౌర్ కెనడాలోని వాంకోవర్ నగరంలో వంద మీటర్ల రన్నింగ్ ట్రాక్ లో ఒకటిన్నర నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారామే. ఆమె తో పాటు పోటీ పడిన వాళ్ళు డెబ్బై ,ఎనభై ఏళ్ళ వాళ్ళున్నారు. అందులో నూరేళ్ళు దాటిన మనిషి మన్ కౌర్ ఒక్కరు. ఆమె కొడుకు గురుదేవ్ సింగ్ కు 78 ఏళ్ళు .గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఆమె పేరు నమోదు అయింది.తల్లీ కొడుకులు ఉదయం సోయ పాలు తాగి మొలకెత్తిన గోధుమల పిండితో చేసిన చపాతిలు తిని ,గింజలు ,పెరుగు పండ్లు ,పండ్ల రసాలు గోధుమ గడ్డి రసం వంటివే తీసుకొంటారు. ఎక్కడ పరుగు పందాలు జరిగినా ఈ తల్లీ కొడుకులు పాల్గొంటారు. ఈ సంవత్సరం స్పెయిన్ లో జరిగే స్ర్పింగ్ రన్ లో ఇద్దరు పాల్గొంటారు.

Leave a comment