ఒక్క రోజు బయట ఊరికి వెళ్ళినా అమ్మాయిలకు తమ మేకప్ సామాగ్రి, అలంకరణ వస్తువులు అన్ని కావాలనుకుంటారు. బ్యాగ్ లో పడేస్తే అన్ని ఒక పట్టానా చేతికి అందవు ఏ లిప్ స్టిక్కో అడుక్కు జారిపోతుంది. ఇష్టంగా పెట్టుకోవాలనుకున్న జూకాల్లో ఒకటి ఎక్కడో ఇరుక్కుపోతుంది. డ్రెస్సింగ్ మేకప్ ఆర్గనైజర్ గనుక కొనేస్తే ఈ సమస్య రాదు. ఇవి చూసేందుకు గుండ్రని పర్స్ లో ఉంటాయి. ఇందులో కావలిసినన్ని పెట్టేసి దానికి ఉన్న డోరిలను దగ్గరకు లాగితే పర్స్ లా అయిపోతుంది. అవసరమైనప్పుడు దాన్ని వొళ్ళో పరుచుకోవచ్చు. డోరీలు విప్పేస్తే చాలు వస్తువులు ఎదురుగ్గా ఉంటాయి. ప్రయాణాల్లో ఇవి చాలా ఉపయోగం.చిన్నగా ఉంటాయి కనుక హ్యాండ్ బ్యాగ్‌ లో ఉంచుకోవచ్చు.

Leave a comment