గర్భవతిగా ఉంటే నోరు అరుచిగా ఉన్నట్లు ఉంటుంది.కాస్త జ్యూసీ గా రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే అల్పాహారం కావాలి అనిపిస్తుంది. ఇవన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. నానబెట్టిన మొలకలు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంప ముక్కలు ,ఒక దోసకాయ ముక్క టోమోటో ముక్కులు కొత్తి మీర ,తాజా కొబ్బరి ,చిన్న బెల్లం ముక్క బీట్ మసాలా ఉప్పు ,మిరపకాయలు ఇవన్ని కలిపితే నిజానికి రుచికరమైన అల్పాహారం తయారవుతుంది. సలభంగా జీర్ణం అవుతాయి. తేనె అల్లం ,మింట్ ఆకులు ఎండు ద్రాక్ష ,బ్లు చెర్రీ ,స్ట్రాబెర్రీ ఇవన్నీ రుచి కోసం కలుపుకోవచ్చు కూడా. ఈ అల్పాహారంతో పాటు తేనె అల్లం ,దాల్చిన చెక్క, మిరియాలు,లవంగాల పొడి కలిపిన టీ కూడా ఆరోగ్యమే . నూనె తగలని ఈ చిన్న అల్పాహారం నోటికి హితుగవుగా ఉంటుంది కూడా.

Leave a comment