క్రితం నెల 25వ తేదీన  జార్జ్ ఫ్లాయిడ్  అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు బంధించి తీసుకు వెళ్లే క్రమంలో పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ అతని తలను నేలకు అదిమి పెట్టి మెడపై నా మోకాలితో తొక్కి పట్టాడు.ఊపిరి ఆడటంలేదు వదలండి అంటూ ఫ్లాయిడ్ వేడుకొన్న వదలలేదు.గిజగిజ లాడుతూ ప్రాణాలు వదిలిన ఈ వీడియో బయటికి వచ్చి ఒక నల్లజాతి వ్యక్తి పైన అమెరికన్ పోలీస్ చేసిన దురాగతానికి ప్రపంచం నివ్వెరపోయింది. భర్త చేసిన దారుణానికి ఆయన భార్య కెల్లీ  కూడా గళం విప్పింది.ఇలాంటి వాడి తో కాపురం నా కొద్దు అంటూ కోర్టుకు ఎక్కింది.2018 లో మిస్సెస్ మిన్నెసోటా  అందాల పోటీల్లో టైటిల్ సాధించింది కెల్లీ.జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి భర్త కారణమైన సంఘటన తర్వాత కెల్లీ స్వయంగా మాట్లాడలేదు కానీ ఆమె తరఫు న్యాయవాదులు, మాత్రం ఆమె ఈ మరణ వార్త విని ఎంత తల్లడిల్లా రో చెప్పారు.ఆయన వాళ్లు ఘోరాలు నేరాలు చేస్తే సమర్ధిస్తారు కానీ ఇలా విడాకులకు సిద్ధమైన కెల్లీ ని అందరూ అభినందించారు.

Leave a comment