మూఢ నమ్మకాలు జీవితాలను ప్రమాదంలో నెడతాయి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ,అధికంగా ఉన్నతస్థితిలో ఉన్నా అట్టడుగున్న ప్రతి వాళ్ళు నమ్ముతారు మంచి నక్షత్రంలో బిడ్డపుటేలా డాక్టర్లను కోరుతుంటారు డాక్టర్లకేం నష్టం అనవసరంగా సిజేరియన్లు సంఖ్య పెరుగుతోంది . లక్కీ చీరె,లక్కీ షర్ట్,లక్కీ నంబర్ అంటూ ఎన్నో నమ్మకాలుంటాయి దాదాపుగా సగం మంది ఎదో బలహీన క్షణంలో కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి . ఇక వాటిని వదల లేక పోతారు . మన శక్తి పైన నమ్మకంపోయి అర్ధం లేని నమ్మకాలు పెంచుకుంటారు. ఎప్పుడో పరిణామ దశలో తమ చుట్టు ఏం జరుగుతుందో ,ప్రకృతి ఏమిటో ,సముద్రాలు ఏమిటో,వర్షం ఏమిటో ఏమి అర్ధం చేసుకోలేని దశలో తమకుతాము ధైర్యం చెప్పుకునేందుకు కొన్ని నమ్మకాలు పెట్టుకొని వుండచ్చు. మరి ఇలాటి రోజుల్లో మూఢ నమ్మకాలను నమ్మేవాళ్ళను ,ఆచరించే వాళ్ళను ఏమనుకోవాలి ? సైంటిఫిక్ గా రుజువు అయితేనే దేన్నయినా నమ్మాలి కదా !.

Leave a comment