స్త్రీల శరీరాల్లో హార్మోన్స్ చేసే కల్లోలం అంతా ఇంతా కాదు. పిల్లలను కనటం ,మోనోపాజ్ ఇవన్ని వాళ్ళ శరీరాన్ని కుంగదీసేవే .సహాజంగా జరిగేవే అంటారు కానీ శరీరం తట్టుకొని యధ ప్రకారం తయారవ్వాలంటే పట్టే సమయంలో ఆహారం ,జీవితావిధానం పట్ల సరైనా శ్రధ్ధ తీసుకోకపోవటం వల్లనే ఆస్ట్రియో ఫోరోసిస్ భారీన పడే అవకాశాలున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. క్రమం తప్పకుండా వేళల్లో ఆహారం ,ఉదయపు ఉపవాహారం వీటితో పాటు అరగంట అయినా శరీరానికి సూర్యరశ్మి అందాలి. ఉదయం ఏడు,ఎనిమిది మధ్య ,సాయంత్రం ఐదు ,ఆరు గంటల వధ్య తగిలే ఎండ చాలా మంచిది. ఈ సమయంలో సన్ ట్యాన్ ఏర్పడదు.పాలు పదార్థాలు భాధం పప్పులు ,ఆకు పచ్చని కూరగాయలు పండ్లు తీసుకోవాలి. ఎముకల సాంద్రతకు వర్కవుట్స్ శరీరం ప్లెక్సిబుల్ గా ఉండేందుకు ఎక్సర్ సైజులు చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment