Categories
అందమైన బ్యాగ్స్ అందమైన డ్రెస్ కు మాచింగ్ గా బావుంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఆ బాగ్స్ ఎంచుకోవాలన్నారు స్టయిలిస్టులు. క్లబ్ పార్టీలకు బాగా నప్పుతుంది. ఎన్నో హంగులతో, రకరకాల డిజైన్ లతో ఆధునికమైన దుస్తులకు మాచింగ్ గా క్లచ్ మంచి ఎంపిక. అలాగే టోటే కాస్త పెద్దగా విహార యాత్రలకు వెళ్ళేందుకు తీసుకు పోవొచ్చు. లాప్ టాప్ తో సహా ఎన్నో వస్తువులు ఇందులో తీసుకుపోవచ్చు. హాబో చాలా స్టైలిష్ గా వుంటుంది. ఇందులో మనకి అవసరమైనన్ని వస్తువులు పడతాయి ఏ సందర్భంలో నైనా, ఏ వేళలో అయినా ఎలాంటి ఆధునికమైన డ్రెస్ లో నైనా టోబె మంచి మాచింగ్. ఇక బ్యాక్ పాక్, ఫోల్డేడ్, క్రాస్ బాడీ ఇవన్నీ వుద్యోగినుల ఎంపిక ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సిన అన్ని వస్తువులతో ఇవి సౌకర్యంగా ఉపయోగ పడతాయి.