నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చికాకు, కోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో నడుము, కీళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఏమి తినాలనిపించదు. వీటి నుంచి ఉపశమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకున్న గదిలో ఒక మూల తాజాగా వాసనలు వచ్చే పూలగుత్తిని ఉంచుకొవాలి. పరిమళాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అలగే మంచి సువాసన ఇచ్చే కొవ్వోత్తి వెలిగించిన పర్లేదు. నొప్పుల ఉపశమనానికి హీటింగ్ ప్యాక్స్ దొరుకుతాయి. వాటితో వేడి నీళ్ళ కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే భోజనం విషయంలో మార్పులు చేసుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. నీటి నిల్వలు తగ్గకుండా తరచుగా నీటిని తాగాలి. అచ్చంగా నీళ్ళు తాగలేకపోతే ఆ నీళ్ళ సీసాలో కొన్ని పుదినా ఆకులు, కీరదోస ముక్కలు వేస్తే బావుంటాయి.

Leave a comment