2019 అంతర్జాతీయా మహిళ దినోత్సవపు అధికారిక రంగుగా ఊదా రంగు ఎంపికైంది.స్వఛ్ఛతకు,ఆశకు ,ఆధికారానికి,ఐశ్వర్యానికి కూడా ఈ ఊదా రంగు ను చిహ్నంగా చెపుతారు. ఫ్యాషనిస్ట్ లు కూడా ఈ పర్పుల్ కలర్ ను అత్యంత అందమైన రంగుగా గుర్తించారు. ధైర్యానికి కూడ ఇది సూచన. గుచ్చి,రోజాస్,లాహేర్లా వంటి ప్రముఖ సంస్థల డిజైనర్లు ఈ ఊదా రంగునే ఎంచుకొంటారు.సృజనాత్మకతని,సంపదని వ్యక్తం చేసే ఈ అద్బతమైన రంగులో ప్రకృతిలో మనకు కనిపించే లావేండర్,లిలాక్,వైలెట్ పువ్వులు ఎంతో విలువైనవి కూడా. పవిత్రతను ఆధ్యాత్మిక భావనను ప్రతిబింభించే ఊదా రంగు ఒక కొత్త పొరాట శక్తిని ,ఉత్సహాన్ని ఇవ్వగలదని విజ్ఞల ఆలోచన.

Leave a comment