డిజిటల్ ప్రింట్ గౌన్ స్టైల్ లోనూ ఇంకో వెస్ట్రన్ స్టైల్ లోనూ సల్వార్ కుర్తీలు ,హాండ్ ప్రింట్ తోనూ కుర్తీలు ఫ్యాషన్ ఐకాన్ లాగా ఉంటాయి. నెక్ డిజైన్ తో ,ప్రింటెడ్ ఆర్ట్ తో డిజైనర్ కుర్తీలు ఆన్ లైన్ లో కనువిందు చేస్తున్నాయి. ఇలాంటి కుర్తీలు ఎన్నో రంగుల కాంభినేషన్స్ తో కాలేజీకి, కార్యాలయాలకు హాయిగా వేసుకోవచ్చు. ప్రకాశవంతమైన రంగులపై హాండ్ ప్రింట్స్ఉన్న కుర్తీలు ఎప్పటికీ ష్యాషన్ లుక్ తోనే ఉంటాయి. చేతుల దగ్గర కుచ్చులు ఉన్న కుర్తీలు అదనపు ఆకర్షణ కూడా. ఈ సీజన్ లో ఫుల్ లెంగ్త్ కుర్తీలు అనువుగా ఉంటాయి కూడా. అసిమెట్రికల్ డిజైన్లు, త్రీ బై ఫోర్స్ చేతులతో చూడ ముచ్చటగా ఉన్న కుర్తీల డిజైన్ల కోసం ఆన్ లైన్లో ఫుష్కలంగా ఉన్నాయి. షార్ట్ టాప్ లో త్రీ బై ఫోర్త్ చేతులు ,మిడ్ లెంగ్త్ కుర్తీలకు మోచేతుల వరకు చక్కగా ఉన్నాయి.

Leave a comment