చిలసౌలో నటించి వంద మార్కులు సపాదించింది రుహానిశర్మ. ఉత్తరాది నుంచి వచ్చిన దక్షిణాది వాతవరణం నచ్చదంటుంది. రుహాని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. చదువుకునే రోజుల నుంచే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలు పెట్టాను. దీపికా పడుకునే తో కూడా ఓ యాడ్లో నటించాను. ఆ యాడ్స్ చూసి నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ఈ సినిమా హీరోకి ఎంత ప్రాముఖ్యం ఉందో హీరోయిన్ గా అంత ప్రాముఖ్యం ఉంది కనుక నాకెంతో పేరు వచ్చింది.మొదటి నుంచి దక్షిణాది సినిమాలంటేనే నాకిష్టం.బాషా తెలియకపోయిన పదే పదే సినిమాలన్ని చూసేదాన్ని . ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ దక్షిణాది సినిమాలు వదలను అంటుది రుహానీ శర్మ.

Leave a comment