ఐదారేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు చేతులు నోట్లో పెట్టేసుకుంటారు. ఒక అద్యాయినం మూడు నలుగు వందల సార్లు అని చెప్పుతుంది. ఒక్క రోజు లో వాళ్ళ బాల్ తో ఆడతారు, సైకిల్ తొక్కుతారు. పెంపుడు జంతువులతో ఆడతారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తారు. ఇవే చేతులు నోట్లో పెట్టుకుంటారు.  అయితే ఏదైనా తినేందుకు పెట్టే ప్రతి సారీ పిల్లల చేతుల్ని యాంటీ బాక్టీరియల్ సోప్ తో కదగారా? ప్రతి పది నిమిషాలకు సింక్ దగ్గరకు పొమ్మనాలా అని తల్లి దండ్రులు సహజంగా భయపడుతూ వుంటారు. కానీ అంట శ్రమ వద్దు అంటున్నాయి అద్యాయినాలు. ఆటలాడాక, బాత్ రూమ్ కు వెళ్ళాక, జంతువులతో ఆటలు ముగించాక భోజనానికి ముందు, చేతి వేళ్ళ నడుమ, వెనక, సాధారణ సబ్బుతో 20 సేకేండ్లు కడుక్కుంటే చాలు హాని కలిగించే సుక్ష్మ జీవులు పోతాయంటున్నారు.

Leave a comment