కీళ్ళ జబ్బుల్ని తగ్గించటం సులభమే అంటున్నాయి కొత్త పరిశోధనలు. కొన్ని జీవుల్లో తోక తెగితే మళ్ళి పుట్టుకొస్తుంది. అదే మాదిరిగా మనుషుల్లోను కీళ్ళ ఎముకల్లోని మృదులాస్థి కణ జాలం దెబ్బతింటే దాన్ని పునరుద్దరించే అవకాశం ఉందంటున్నారు. అందు కోసం ఇంటర్ మాలిక్యులర్ క్లక్స్ ఇంట్రెగ్రెల్ పద్ధతి ద్వారా మృదులాస్థి లో ప్రొటాన్ల్ ను లెక్కించే విధానాన్ని రూపొందించారు. దాన్ని అధికంగా శరీరంలోని వివిధ భాగాల్లోని మృదులాస్థి ని పరిశీలించినప్పుడు, మడమల దగ్గర ఉన్న ప్రొటీన్ల్ వయస్సు చిన్నదిగా, మోకాలి దగ్గర మధ్య వయసులో తొడదగ్గర వృద్ధాప్యస్థితిలో ఉన్నట్లు తేలింది. అందు వల్లనే మోకళ్ళలో , తొడ దగ్గర దెబ్బ తగిలితే కోలుకునే సమయం ఎక్కువ పడుతుందని తెలుసుకున్నారు. మృదులాస్థి కణజాల పునరుద్దరణకు కారణమైన మైక్రో ఆర్ ఎన్ ఏ .ను మెడిసిన్ రూపంలో ఇవ్వటం ద్వారా కీళ్ళ జబ్బులు తగ్గుతాయంటున్నారు.

Leave a comment