లాక్ డౌన్ సమయంలో పూర్తి సమయం అంతా ఇంట్లోనే ఉంటారు .గనుక ఆ సమయంలో బరువు పెరగకుండా చూసుకోవాలి .తినే ఆహారం అంతా కలిపి 1500-1600 క్యేలరీలు మించ కుండా చూసుకోవాలి .మిగిలినది ద్రవాహారంలో ఉండాలి .ఉదయం బ్లాక్ కాఫీ తో పాటు రెండు వాల్ నట్స్ , 10 ఎండు ద్రాక్ష తినాలి .10 గంటలకు రెండు ఇడ్లీ సాంబార్ లేదా దోశ లేదా ఉప్మా, పప్పుతో రెండు చపాతీలు పల్లీలు కొబ్బరి చట్నీ లతో తినచ్చు .మధ్యాహ్నం ఒక గ్లాసు రాగి జావా గుప్పెడు పల్లీలు తినాలి .మజ్జిగలో నాననిచ్చిన సబ్జా గింజలు , డ్రై ఫ్రూట్స్ నానబెట్టి కప్పు పాలలో స్మూతీ లాగా, ఉప్మా రవ్వ జావా ఏదైనా తేలికగా తీసుకోవాలి .సాయంత్రం నాలుగు గంటలకు అరటి పండూ లేదా పండ్ల ముక్కలు .6 గంటలకు అన్నం, పెసరపప్పు కిచిడి, ముక్కలతో కూర రాత్రి పసుపు ,మిరియాలు కలిపినా పాలు ఇలా సింపుల్ గా ఆహారం తీసుకుంటే మంచిది .

Leave a comment