అన్ని తినండి కానీ సరైన మోతాదులో తినండి అని చక్కని సీక్రెట్ చెప్పారు నా డైటీషియన్ రుజుత ,ఆమె చెప్పిన ప్రకారం మ్యాంగో లాంటి తీయని పండ్లు తిన్న నాకేమీ నష్టం రాలేదు. బరువు సరిగ్గ ఉంచుకోవాలి అనుకొంటే ప్లేట్లో ఆహారశాల సరిగా ఉండాలి అంటోంది కరీనా కపూర్. నిజంగానే స్వీట్లు ఐస్ క్రీమ్ లు కాండీలు జెల్లీ కేకులు   రుచిగానే ఉంటాయి. అవి మన శరీరం లోని తెచ్చే కాలరీలు షుగర్ గురించి ఆలోచించాను తీపి ఎక్కువగా ఉంటే మామిడి ,సపోటా అరటి వంటివి తిన్నాను ఖర్బుజా,తర్భుజా వంటి సహజ తీపి దనం వుండే పండ్లు తీసుకొన్న. కానీ రుజుత చెప్పినట్లు నా ప్లేట్ లో సరైన మోతాదులో ఆహారం వుండేలా చూసుకున్నాను. ఎటూ యోగ,ఎక్సర్ సైజ్లు ఉన్నాయి కదా అంటోంది కరీనా కపూర్. అవును తినచ్చు. ఏదైనా కానీ మితంగా !.

Leave a comment