Categories
క్రంచెస్ వంటి వ్యాయమాలు చేస్తూ ఉంటే కాస్త ఎక్కువగానే తినాలి. తిన్న,పొట్ట దగ్గర కొవ్వు ఇట్టే కరిగిపోతుంది అనుకొంటారు, కానీ ఇవన్నీ అపోహలు అంటారు నిపుణులు సాధారణంగా వ్యాయమాలు శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతోంది . దీన్ని వల్ల తిన్నది జీర్ణమై శరీరంలో కేలరీలు పెరగకుండా ఉంటాయి. అయితే ఎంత పడితే అంత తింటే కష్టమే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి . నిపుణుల దగ్గరే వర్క్అప్ లు,స్టెబ్లింగ్ లు ముందు నేర్చుకోవాలి ఆ తర్వాత సొంతంగా చేసుకోవచ్చు . స్టెబ్లింగ్ ఎలాపడితే ఆలా చేస్తే కండరాలు పట్టేస్తాయి. వ్యాయామం జీవితంలో ఒక భాగం అయ్యేలా ప్రతి రోజు చేయటం అలవాటు చేసుకోవాలి, ఇదే శరీరానికి లాభం అని మనసారా నమ్మి చేయటం మొదలు పెడితే విసుగు రాకుండా ఉంటుంది. వ్యాయమ ఫలితాలు కూడా చక్కగా అందుతాయి.