ఏ పదార్ధమైన చేత్తో ముట్టుకొని తింటేనే ఆ పదార్ధానికి అదనపు రుచి వస్తుంది అంటున్నారు పరిశోధకులు. స్పూన్ తో తినే వాళ్ళకంటే చేత్తో తినేవాళ్ళు ఎక్కువ తింటారట. నోట్లో పెట్టుకోక ముందే ఆహారాన్ని తాకటం వల్ల మెదడు దాన్ని గురించి వెంటనే ఆలోచించటం వల్లనో రుచి పెరుగుతోంది. ఏం తింటున్నామో అవగాహన తో తినటం వల్ల ఆ పదార్ధపు రుచి ఆస్వాదిస్తూ తింటామన్నమాట ఇది బరువు తగ్గాలనుకొన్న వాళ్ళకి హెచ్చరిక కూడా. చేత్తో తినేప్పుడు కాస్త చూసుకొని తినాలి. అలాగే ఆరోగ్య స్పృహ లో ఉంటే వాళ్ళకి ఇదో చక్కని కబురు. స్పూన్ ఉపయోగించ కుండా చేత్తో తింటే ప్రతి పదార్ధం యొక్క రుచి,అందులో వాడిన పదార్ధాలు మెదడు చెప్పేస్తూ వుంటే ఆ భోజనం మరింత రుచిగా ఉంటుందన్నమాట.

Leave a comment